అమ్మినంత అమ్ముకో.. మామూలుగా మసలుకో! | - | Sakshi
Sakshi News home page

అమ్మినంత అమ్ముకో.. మామూలుగా మసలుకో!

Mar 3 2026 9:20 AM | Updated on Mar 3 2026 9:20 AM

లేదంటే దాడులు తప్పవు బెల్టు దుకాణాదారులకుమద్యం వ్యాపారుల హుకుం ఒక్కొక్కరి వద్ద రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు

పరిగి: మద్యం దుకాణదారుల తీరు విస్మయానికి గురిచేస్తోంది. గ్రామాల్లో బెల్టు షాపులను ప్రోత్సహించడంతో పాటు వీరి నుంచి ప్రతినెలా మామూళ్లు వసూలు చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఎంతైనా అమ్ముకోండి.. ఏమైనా చేస్కోండి.. ఎకై ్సజ్‌ అధికారులతో పాటు ఎవరూ రాకుండా, దాడులు జరగకుండా అంతా మేమే చూస్కుంటాం.. అని భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా యథేచ్ఛగా మద్యం దందా నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడెక్కడ, ఎన్ని బెల్టు దుకాణాలు ఉన్నాయనే సమాచారాన్ని ముందుగానే సేకరించారు. కొంత మంది బృందాలుగా ఏర్పడి గ్రామాల్లోని బెల్టు దుకాణదారులను కలిసి, నెలనెలా కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేశారు. పల్లెలు, గల్లీల్లో మద్యం విక్రయించే వారి సమాచారం పూర్తిగా తమ వద్ద ఉందని, మామూళ్లు ఇవ్వకపోతే దాడులు చేయిస్తామని హెచ్చరిస్తున్నారని బెల్టు షాపుల నిర్వాహకులు వాపోతున్నారు. దీనికి తోడు ఎన్నడూ లేని విధంగా ఒకే దుకాణంలోనే మద్యం కొనుగోలు చేయాలని నిబంధన పెడుతున్నారని చెబుతున్నారు.

వందల సంఖ్యలో దుకాణాలు

పరిగిలో మొత్తం ఏడు మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి నిర్వాహకులందరూ సిండికేట్‌గా మారి వ్యాపారం చేస్తున్నారు. రెండు దుకాణాలను ఒకే చోట ఏర్పాటు చేయడంతో పాటు, ఒకే దుకాణం నుంచి బెల్టు షాపులకు మద్యం తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేస్తూ కొత్త దందాకు తెరలేపారు. ప్రతినెలా బెల్టు దుకాణాల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు. మండల వ్యాప్తంగా సుమారు 150 బెల్టు దుకాణాలు ఉన్నాయి. ఒక్కో షాపునుంచి విక్రయాల ఆధారంగా రూ.2 వేల నుంచి రూ.5 వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా ప్రతి నెలా రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సేకరిస్తున్న సొమ్మును అధికారులకు లంచంగా ఇస్తున్నారా.. లేదా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ప్రతినెలా కప్పం కట్టాల్సిందే

దాడులు చేయిస్తాం..

పట్టణంతో పాటు మండలంలో మద్యం సిండికేట్‌ వ్యాపారం రోజుగా సాగుతోంది. మద్యం దుకాణదారులు బెల్టు షాపుల నుంచి నెలనెల వసూలు చేసిన సొమ్ము రూ.లక్షల్లో ఉంటోంది. లెక్కలు వేసుకుని మరీ వసూళ్లకు పాల్పడటం విమర్శలకు తావిస్తోంది. మామూళ్లు ఇవ్వకపోతే దాడులు జరుగుతాయని బాహాటంగానే హెచ్చరిస్తున్నారు. పలు వురు ఎకై ్సజ్‌ అధికారులు సైతం బెల్టు దుకాణాల నిర్వాహకులు వైన్స్‌లకు మామూళ్లు ఇవ్వాల్సిందేనని చెప్పడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement