బంట్వారం: మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఒక్క దరఖాస్తు అందలేదు. ఎంపీడీఓ రాములు తదితరులు మీటింగ్ హల్‌లో వేచి చూసినప్పటికీ ప్రజల నుంచి స్పందన కనిపించ లేదు. సమస్యలు ఉంటే ప్రజావాణిలో అర్జీలు అందజేస్తే క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారిస్తామని ఎంపీడీఓ తెలిపారు.
ప్రజావాణి వినేదెవరు!
పరిగి: ప్రజా సమ్యలను నేరుగా అధికారులకు విన్నవించుకునేలా ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని రూపొందించింది. కాగా సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా కార్యక్రమానికి ఎంపీడీఓ మినహా అధికారులు ఎవరూ హాజరుకాలేదు. ప్రజావాణి కార్యక్రమానికి ఏఏ శాఖల అధికారులు పాల్గొన్నారనే విషయాన్ని కలెక్టర్‌కు నివేదికను అందించాల్సి ఉంటుంది. కానీ ప్రతి వారం అధికారులు రాక పోవడంతో వారిపై చర్యలు తీసుకోకపోవడంపై అధికారులు బేఖాతరు చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రజావాణికి గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రామలింగేశ్వరాలయంలో హుండీ లెక్కింపు
కుల్కచర్ల: పాంబండ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం శివరాత్రి ఉత్సవాల కు సంబంధించి హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ బాలనర్సయ్య, పర్యవేక్షకులు ప్రణీత్ కుమార్ మాట్లాడుతూ.. రూ.2,01,853 నగదుకు సమకూరిందని చెప్పా రు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కోట్ల మైపాల్‌రెడ్డి, బండవెల్కిచర్ల సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ గోవర్దన్ రెడ్డి, ఆల య అర్చకులు పాండు శర్మ,సాంబశివాని సేవాసమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


