కాలినడకన ఆస్పత్రికి వెళ్తున్న
రోగులు, కుటుంబీకులు
ట్రాఫిక్‌ను మళ్లిస్తున్న పోలీసులు
అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని అనంతగిరిగుట్టల్లో ఉన్న హరితరిసార్ట్స్‌కు లోకసభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ, ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాలను బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం మీదుగా దారి మళ్లించారు.
యధావిధిగా అంబులెన్స్ సేవలు
ఎన్‌టీఆర్ చౌరాస్తా నుంచే వాహనాలు మళ్లించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రికి సైతం ఆటోలను అనుమతించకపోవడంతో రోగులు, వారి కుటుంబీకులు కాలినడకనే ఇబ్బందులు పడుతూ ఆస్పత్రికి చేరుకున్నారు. అంబులెన్స్ సేవలు యధావిధిగా కొనసాగాయి.


