సత్ప్రవర్తనతో కేసుల ఎత్తివేత | - | Sakshi
Sakshi News home page

సత్ప్రవర్తనతో కేసుల ఎత్తివేత

Feb 28 2026 8:45 AM | Updated on Feb 28 2026 8:45 AM

సత్ప్

సత్ప్రవర్తనతో కేసుల ఎత్తివేత

కోర్టు తీర్పుపై హర్షం

మోమిన్‌పేట: సత్ప్రవర్తనతో కేసులు ఎత్తివేస్తామని ఎకై ్సజ్‌ సీఐ సహదేవుడు అన్నారు. శుక్రవారం తహసీల్దార్‌ రవీందర్‌ ఎదుట పాత నేరస్థుడిని బైండోవర్‌ చేసి, మాట్లాడారు. ఆరు నెలల క్రితం బైండోవర్‌ చేసిన సయ్యద్‌ అప్రోజ్‌.. తిరిగి గంజాయి సేవిస్తున్నాడని తెలిపారు. దీంతో అతనిపై కేసు నమోదు అయిందని చెప్పారు. బైండోవర్‌ అయిన వ్యక్తి అదే తప్పు మళ్లీ చేసినందున రూ.10వేల జరిమానా విధించి, చలనాతో తహసీల్దార్‌ ఎదుట హాజరు పరిచామని పేర్కొన్నారు. యువత గంజాయికి బానిస కావద్దని సూచించారు.

నేత్రపర్వంగా రథోత్సవం

నవాబుపేట: మండల పరిధి ఎల్లకొండ శివాలయం శుక్రవారం శివనామ స్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జామున కుంకుమార్చన, అభిషేకం, హారతి, మంత్రపుష్పం జరిపించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను రథంపై ప్రతిష్టించి, ప్రధాన వీధుల ఊరేగించారు. రథం లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఆలయ కమిటీ చైర్మన్‌ భరత్‌ రెడ్డి, సర్పంచ్‌ కొండల్‌ యాదవ్‌, మాజీ సర్పంచ్‌ వెంకట్‌ రెడ్డి పాల్గొన్నారు.

జీతభత్యాల ప్రస్తావన బాధాకరం

అనంతగిరి: విద్యా కమిషన్‌ పరిధిలో లేని అంశాలను కమిషన్‌ రిపోర్టులో ప్రస్తావించడం సరైంది కాదని తపస్‌(తెలంగాణ ఉపాధ్యాయ సంఘం) జిల్లా అధ్యక్షుడు కూర సంగమేశ్వర్‌, ప్రధాన కార్యదర్శి గాజుల బస్వరాజు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీచర్లకు జీతాలు ఎక్కువని రాయడం.. ఉపాధ్యాయులను కించపరచడమే అవుతుందన్నారు. వేతనాలను పీఆర్‌సీ కమిటీ నిర్ణయిస్తుందని, ఆ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం వాటిని అమలు చేస్తుందన్నారు. పీఆర్‌సీ రిపోర్టు అనేది ధరల పెరుగుదల, జీవన ప్రమాణాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇది ప్రమాణాల ఆధారంగానే జీతభత్యాల నిర్ణయం జరుగుతుందన్నారు. అందుకు విరుద్ధంగా కమిషన్‌.. రిపోర్టులో పేర్కొందని, అలా కాకుండా.. విద్యా వ్యవస్థ తీరు, మార్పులు, సమగ్ర అభివృద్ధి దిశగా సూచనలు చేయాలని సూచించారు. జీతాల గురించి ప్రస్తావించడం సరికాదన్నారు.

తీవ్రంగా ఖండిస్తున్నాం

విద్యా కమిషన్‌ ఇచ్చిన రిపోర్టులో ఉపాధ్యాయులకు వేతనాలు ఎక్కువ అనే పదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులకు ఇచ్చే వేతనం దేశ భవిష్యత్తుకు పెట్టుబడి అన్నారు. అలాంటి మహోత్తర సేవ చేస్తున్న ఉపాధ్యాయుల జీతాలను ఎక్కువగా పేర్కొనడం సరి కాదని హితవు పలికారు.

నిందితులను శిక్షించాలి

ధారూరు: నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెరలో పసికందు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్సీ,ఎస్టీ,బీసీ మండల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. చిన్నారి మృతికి నిరసనగా.. శుక్రవారం రాత్రి మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. నిందితులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి, హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు.. ఇళ్లు, రూ.25 లక్షల పరిహారం అందించాలని కోరారు. కుమ్మెరలో దళితులు, రజకులపై జరిగిన దాడిని ఖండించారు.

కందుకూరు: కుట్రదారులకు చెంపదెబ్బ కొట్టేలా న్యాయం స్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించిందని, కడిగిన ముత్యంలా కవితక్క బయటికి వచ్చారని జాగృతి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి అన్నారు. కోర్టు తీర్పు అనంతరం శుక్రవారం ఆమెను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజం ఎప్పటికై నా బయటికి వస్తుందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. తప్పుడు సాక్షాధారాలతో కోర్టును ఏమార్చలేరనే విషయం తేటతెల్లమైందన్నారు. న్యాయ వ్యవస్థపై తమకున్న నమ్మకం ఈ తీర్పుతో మరింత పెరిగిందన్నారు.

సత్ప్రవర్తనతో కేసుల ఎత్తివేత 1
1/2

సత్ప్రవర్తనతో కేసుల ఎత్తివేత

సత్ప్రవర్తనతో కేసుల ఎత్తివేత 2
2/2

సత్ప్రవర్తనతో కేసుల ఎత్తివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement