ప్రజాసేవకు అంకితమవ్వండి
కొడంగల్: సర్పంచులు ప్రజాసేవకు అంకితమవ్వాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్‌బాబు అన్నారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో పర్యటించి ప్రజల అవసరాలు తెలుసుకోవాలన్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. సర్పంచ్ పదవికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఆ గ్రామానికి ఆయనే మొదటి పౌరుడని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని గ్రామాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఓ జయసుధ, మాస్టర్ ట్రైనర్స్ వినయ్‌కుమార్, రాములు, డీఎల్‌పీఓ సంధ్య, ఎంపీడీఓలు ఉషశ్రీ, వెంకన్న గౌడ్, జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్ ఎంపీఓలు సుందర్, యాదగిరి, దయానంద్, అంజిరెడ్డి పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ సుధీర్‌బాబు


