అన్నీ ఓకే
అనంతగిరి: వికారాబాద్ మున్సిపాలిటీలో శనివారం నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. 34 వార్డులకు గాను 284 నామినేషన్లు వచ్చాయి. వాటిలో ఒక్కటి కూడా తిరస్కరణకు గురికాలేదు. 179 మంది అభ్యర్థులు 183 సెట్లు వేశారు. కాంగ్రెస్ తరఫున 83, బీఆర్‌ఎస్ నుంచి 51, బీజేపీ నుంచి 29, ఎంఐఎం తరఫున 9, సీపీఎం 1, ఇతరులు 10 నామినేషన్లు వేశారు. వీరిలో పార్టీ బీ ఫాం ఎవరికి దక్కుతుందో వేచిచూడాలి.
ధారూరు: స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు శనివారం 460 సంచుల కందులు వచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి సిద్దమ్మ తెలిపారు. గత వారం రూ.8,050 కాగా ఈ వారం రూ.8,570 ధర పలికిందన్నారు. క్వింటాలుకు ఎక్కువగా రూ.8,570 మధ్యస్థంగా రూ.7,425, తక్కువగా రూ.8,800కు వ్యాపారులు కొనుగోలు చేశారు. ప్రతి వారం కందుల రాక తగ్గుడంపై మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యకం చేశాయి. కొంతమంది బ్రోకర్లు గ్రామాల్లో నేరుగా కొనుగోలు చేయడంతో మార్కెట్ రాక తగ్గిందని రైతు నాయకులు వాపోయారు. కందుల రాక తగ్గడంతోనే వ్యాపారులు ధర పెంచి కొనుగోలు చేశారని వారు వివరించారు.


