శిక్షణ తరగతులు | - | Sakshi
Sakshi News home page

శిక్షణ తరగతులు

Feb 1 2026 10:43 AM | Updated on Feb 1 2026 10:43 AM

శిక్షణ తరగతులు

శిక్షణ తరగతులు

ఉమ్మడి ఏపీ డీసీసీలకు

ఈ 21 నుంచి మార్చి 3వ తేదీ వరకు..

ఏర్పాట్లను పరిశీలించినఏఐసీసీ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌

అనంతగిరి: వికారాబాద్‌ సమీపంలోని అనంతగిరిగుట్టలో ఈ 21 నుంచి మార్చి 3వ తేదీ వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డీసీసీలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. శనివారం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ పరిశీలించారు. టీపీసీసీ ట్రైనింగ్‌ కమిటీ చైర్మన్‌, పరిగి ఎమ్మెల్యే డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్‌తో కలిసి ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ హాజరుకానున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీఽచంద్‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌కుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ తదితరులు ఉన్నారు. వీరంతా ముందుగా వికారాబాద్‌లో సంతోష్‌కుమార్‌ నివాసానికి వెళ్లగా అక్కడ భోజనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement