వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా
తాండూరు టౌన్: పట్టణంలోని 23వ వార్డును అన్ని విధాలా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని బీఆర్‌ఎస్ అభ్యర్థి పరిమళ అన్నారు. శనివారం ఆమె వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో ఒకసారి ఇదే వార్డులో కౌన్సిలర్‌గా గెలిచానన్నారు. వార్డులో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించడంతో పాటు తాగునీటి సౌకర్యానికి ఎంతో కృషి చేశానన్నారు. తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. కారు గుర్తుకే ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.


