అన్ని విధాలా అభివృద్ధి చేస్తా
తాండూరు టౌన్: పట్టణంలోని 24వ వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని బీఆర్‌ఎస్ అభ్యర్థి కొట్రిక నాగలక్ష్మి అన్నారు. శనివారం వార్డు పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. వార్డులో పలు అభివృద్ధి పనులు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగాయన్నారు. వార్డులో ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.


