అవగాహనతో కుష్టువ్యాధి నివారణ
దౌల్తాబాద్: కుష్టుపై అవగాహన కలిగి ఉంటే వ్యాధిని ప్రారంభ దశలోనే నివారించవచ్చని వైద్యాధికారి అమూల్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పీఎంశ్రీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించి మాట్లాడారు. కుష్టురహిత మండలానిగా మార్చడానికి ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం వెంకటయ్య, ఏఎన్‌ఏఎం అనురాధ ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
జగదీష్‌కు ఎంపీ పరామర్శ
తాండూరు టౌన్: బీజేపీ తాండూరు పట్టణ నాయకుడు కుర్వ జగదీష్ అనారోగ్యానికి గురవడంతో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి శనివారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం తన భార్య విజయశాంతిచే నామినేషన్ వేయించిన జగదీష్ ఇంటికి వెళ్లిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఎంపీ హైదరాబాద్‌లోని డెక్కన్ ఆస్పత్రికి వెళ్లి జగదీష్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను కలిసి ధైర్యంగా ఉండాలని, త్వరలోనే కోలుకుంటాడని చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్ జగదీష్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
కొడంగల రూరల్: నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ – బెస్ట్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్(నక్ష) కార్యక్రమాన్ని జిల్లా అధికారులు పరిశీలించారు. శనివారం పట్టణంలోని 5వ వార్డులోని ఆర్ బ్లాక్‌లో కొనసాగుతున్న సర్వే పనులను జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు మధుసూదన్ పరిశీలించారు. ఈ సందర్బంగా సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ మహేష్ తోపాటు గ్రామాల లైసెన్డ్‌స్ సర్వేయర్లు పాల్గొన్నారు.
నేడు వేంకటేశ్వరస్వామి జాతర
దౌల్తాబాద్: మండల కేంద్రంలోని పెద్దచెరువు కట్టపై వెలసిన వేంకటేశ్వరస్వామి మహోత్సవం ఆదివారం జరగనున్నట్లు సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం ప్రత్యేక పూజలు, స్వామికి అభిషేకం నిర్వహిస్తారన్నారు. రాత్రికి పల్లకీసేవలో స్వామివారిని ఊరేగిస్తారన్నారు. అనంతరం రథోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ జాతరకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, భక్తులు పాల్గొంటారని వివరించారు.
అవగాహనతో కుష్టువ్యాధి నివారణ
అవగాహనతో కుష్టువ్యాధి నివారణ


