షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

Feb 1 2026 10:43 AM | Updated on Feb 1 2026 10:43 AM

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

యాలాల: షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ ఇల్లు దగ్ధమైంది. ఈ సంఘటన యాలాల మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఈర్లపల్లి సాయిలుకు చెందిన ఇంట్లో మధ్యాహ్నం ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగిసి పడ్డాయి. క్షణాల్లోనే మంటలు చెలరేగి వస్తువులతో పాటు బీరువాలో దాచుకున్న రూ.లక్ష నగదు, సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులు, ఇతరత్రా పత్రాలు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న తాండూరు ఫైర్‌ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చింది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, తహసీల్దార్‌ వెంకటస్వామి, ఎంపీడీఓ శ్రీనిజ ఘటన స్థలానికి చేరుకొని బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఇంటికి నిప్పంటుకొని ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. బట్టలు, నిత్యావసర సరుకులు కాలిపోయి రోడ్డున పడ్డ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని పలువురు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పేరి రాజేందర్‌రెడ్డి సూచన మేరకు గ్రామ సర్పంచ్‌ శివయ్యతో పాటు కో–ఆప్షన్‌ మాజీ సభ్యుడు అక్బర్‌బాబా, కాంగ్రెస్‌ నాయకులు బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement