ఒక నామినేషన్ తిరస్కరణ
తాండూరు: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శనివారం నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలించారు. తాండూరులో 36 వార్డులకు గాను 12 క్లస్టర్‌ల ద్వారా 24 మంది ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మూడు రోజుల పాటు 183 మంది అభ్యర్థుల నుంచి 273 నామినేషన్లను స్వీకరించారు. అనంతరం నామినేషన్ పత్రాలను పరిశీలన చేశారు. అందులో 3వ వార్డుకు చెందిన అభ్యర్థి కుల ధ్రువీకరణ పత్రం సమర్పించకపోవడంతో అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. మిగిలిన నామినేషన్ పత్రాల ఆమోదించి తుది జాబితాను ఎన్నికల అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి నోటీస్ బోర్డులో ప్రచురించారు.


