ఓటే పౌరుడి వజ్రాయుధం
రేపే జాతీయ ఓటరు దినోత్సవం
● ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రతిజ్ఞ
నవాబుపేట: ఓటే పౌరుడి వజ్రాయుధమని.. 18 ఏళ్లు నిండిన వయోజనులంతా ఓటు హక్కు నమోదు చేసుకుని వినియోగించుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, తహసీల్దార్ బుచ్చయ్య, ఎంపీడీఓ అనురాధ, ఎస్‌ఐ పుండ్లిక్, పలు గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొని ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేశారు.
ఓటు హక్కు వినియోగించుకోవాలి
యాలాల: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని యాలాల తహసీల్దార్ వెంకటస్వామి అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ కార్యాలయం ఎదుట ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ఓటు హ క్కును ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఆర్‌ఐలు వేణు, చరణ్, జూనియర్ అసిస్టెంట్ విజయ్‌కుమార్, జీపీఓలు సిబ్బంది ఉన్నారు.
ఓటు హక్కు వినియోగం బాధ్యత
మోమిన్‌పేట: ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కు వజ్రాయుధంలా పనిచేస్తుందని ఎంపీడీఓ సృజనసాహిత్య అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శుక్రవారం కార్యాలయం సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, ఎంఈఓ మల్లేశం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
వ్యవస్థల నిర్మాణానికి ఓటే కీలకం
కుల్కచర్ల: ప్రజాస్వామ్యంలో వ్యవస్థల నిర్మాణానికి ఓటు హక్కు కీలకంగా పనిచేస్తుందని కుల్కచర్ల ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు అన్నారు. మండల పరిధిలోని ముజాహిద్‌పూర్‌లో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముజాహిద్‌పూర్ సర్పంచ్ చంద్రభూపాల్ రావు, రాంరెడ్డిపల్లి సర్పంచ్ నర్సింలు యాదవ్, జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం జనార్ధన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంతోశ్, వార్డుసభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు
పరిగి: ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు అని తహసీల్దార్ వెంకటేశ్వరి అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణ కేంద్రంలోని నంబర్–1 ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరి మాట్లాడుతూ.. ఓటు విలువను విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, ఎంఈఓ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
అవగాహన ర్యాలీ
దుద్యాల్: ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని తహసీల్దార్ కిషన్, మండల విద్యాధికారి విజయరామారావు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు, అధ్యాపకులు
తాండూరు టౌన్: ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత అని తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వసంతకుమారి అన్నారు. శుక్రవారం కళాశాల పొలిటికల్ సైన్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు ప్రతిజ్ఞ చేశారు. పలువురు విద్యార్థులు వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్, ఏఓ సులేమాన్ హైమద్, అకాడమిక్ కోఆర్డినేటర్ మహేందర్ రెడ్డి, ఐఓఏసీ కో ఆర్డినేటర్ డాక్టర్ కిషన్, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ అధికారులు సంగమేశ్వర్, కళావతి, అధ్యాపకులు నారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి దశ నుంచే అవగాహన
దోమ: ఓటు హక్కుపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవాలని కాంప్లెక్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రూప్‌సింగ్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని దిర్సంపల్లి పాఠశాలలో జాతీయ ఓటరు దినోత్సవంలో భాగంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యానికి పునాది ఓటు
కొడంగల్ రూరల్: ప్రజాస్వామ్యానికి ఓటు పునాదిలాంటిదని, 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ రాంబాబు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం, ఎన్‌ఎస్‌ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు విలువలతో కూడిన నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రిన్స్‌పాల్ రఫియాఖానమ్, అధ్యాపక సిబ్బంది రాంబాబు, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సోమ్లా, నారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఓటే పౌరుడి వజ్రాయుధం
ఓటే పౌరుడి వజ్రాయుధం
ఓటే పౌరుడి వజ్రాయుధం


