సబ్సిడీ వ్యవసాయ పరికరాలతో మేలు
నవాబుపేట: సబ్సిడీ వ్యవసాయ పరికరాలతో రైతులకు మేలు చేకూరుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులు, పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. వ్యవసాయ పరికరాలను తీసుకున్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం 36 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్‌నాయక్, తహసీల్దార్ బుచ్చయ్య, ఎంపీడీఓ అనురాధ, వ్యవసాయ శాఖ ఏడీ వెంకటేశం, ఏఓ జ్యోతి, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు బల్వంత్‌రెడ్డి, శ్రీధర్, లావణ్య, సర్పంచ్‌లు నర్సింహారెడ్డి, జగన్‌రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మెన్ రాంరెడ్డి, నాయకులు మల్లారెడ్డి, నాగిరెడ్డి, వెంకట్‌రెడ్డి, పరమేశ్, మాణిక్యం, ఏఈఓలు, ఏఎంసీ డైరెక్టర్లు ఖదీర్, రాజశేఖర్‌రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య


