సొంతగూటికి మాజీ కౌన్సిలర్
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 32వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ నవీన్‌కుమార్ బీఆర్‌ఎస్‌లో చేరారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన కారుదిగి కాంగ్రెస్‌లో చేరిన విషయం విదితమే. శుక్రవారం ఆయన బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో తన అనుచరులతో కలిసి గులాబీ కండువా కప్పుకొన్నారు. కాగా 32వ వార్డు నుంచి వారి కుటుంబీకులను బరిలో నిలుపనున్నట్లు సమాచారం.
పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
అనంతగిరి: గిరిజన ఆశ్రమ వసతిగృహ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి కమలాకర్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. అవుట్‌సోర్సింగ్, డైలీవేజ్ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. తొమ్మిది నెలలుగా వేతనాలు అందక సిబ్బంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని వివరించారు. ఈ కార్యక్ర మంలో సీఐటీయూ నాయకులు శ్రీనివాస్, రా ములు, శశికళ, మంగమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.
ఆర్‌యూపీపీక్యాలెండర్ ఆవిష్కరణ
అనంతగిరి: రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్(ఆర్‌యూపీపీ)ఆధ్వర్యంలో ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం జిల్లా ఇన్‌చార్జి అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి, డీఈఓ రేణుకాదేవి ఆవిష్కరించారు. అనంతరం సంఘం ఆధ్వర్యంలో పలు విద్యారంగ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఎజాజ్ అహ్మద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కావలి శ్రీశైలం, కార్యదర్శులు రఘునాథ్, మున్నూరు రాజు, ఎర్రవల్లి రవి, ఫారూఖ్, కరుణాకర్ మహేందర్, పలువురు జిల్లా బాధ్యులు, మండలాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
వీరభద్రేశ్వరాలయంలో దీపోత్సవం
కొడంగల్ రూరల్: మండల పరిధిలోని అంగడిరాయిచూర్ వీరభధ్రేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఏకోపాధ్యాయ పాఠశాల, గ్రామ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య బాలరాముడి ప్రతిష్ఠాపన రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దీపాలంకరణ చేశారు. అనంతరం భక్తులకు పురోహితులు భానుప్రకాశ్, శివకుమార్ తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఏకల్ పాఠశాల అంచల్ అభియాన్ జె.కృష్ణాజీ, సంచు సాధక్ అశోకచారి, మాతాజీ చంద్రకళ, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సొంతగూటికి మాజీ కౌన్సిలర్
సొంతగూటికి మాజీ కౌన్సిలర్
సొంతగూటికి మాజీ కౌన్సిలర్


