చదువుతోనే సమాజంలో గుర్తింపు
అనంతగిరి: ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని విద్యనభ్యసించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం, జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా వికారాబాద్‌లోని జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వివిధ భాషలపై పట్టు సాధించాలన్నారు. తద్వారా కొత్త విషయాలు తెలుసుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని తెలిపారు. చదువును ఆయుధంగా మలుచుకొని జీవితాన్ని గొప్పగా తీర్చి దిద్దుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలకు వెళ్లే అలవాటు చేసుకోవాలన్నారు. బాలల హక్కులను పరిరక్షించడం మన బాధ్యత అన్నారు. అనంతరం గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ప్రజలకు, యువతకు కావాల్సిన పుస్తకాలు గ్రంథాలయా ల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం బా లల హక్కులపై డీడబ్ల్యూఓ కృష్ణవేణి ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వ్యాసరచన, రంగోలి, మెహందీ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కలెక్టర్ బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సురేష్ బాబు, డీపీఆర్‌ఓ చెన్నమ్మ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులకు సూచించారు. గురువారం నగరం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటర్లు వారి వార్డుల వారీగా ఏమైన తప్పుగా మ్యాపింగ్ ఉంటే సరిచేసుకోవాలన్నారు. ఇందు కోసం పంచాయతీ కార్యదర్శి లేదా ఎంపీడీఓకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వాటిని ఈ నెల 22న జిల్లా పంచాయతీ అధికారి పరిశీలించి పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీపీఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.
బాలల హక్కులను కాపాడుదాం
పూడూరు: బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. గురువారం పూడూరు జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవంలో భాగంగా నిర్వహించిన బాల సభలో పాల్గొన్నారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాని ఆదేశించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సాయిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
బాలల హక్కుల పరిరక్షణ మన బాధ్యత
కలెక్టర్ ప్రతీక్ జైన్
చదువుతోనే సమాజంలో గుర్తింపు


