డయాలసిస్‌ రోగులకు కరెంట్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

డయాలసిస్‌ రోగులకు కరెంట్‌ కష్టాలు

Nov 21 2025 11:42 AM | Updated on Nov 21 2025 11:42 AM

డయాలసిస్‌ రోగులకు కరెంట్‌ కష్టాలు

డయాలసిస్‌ రోగులకు కరెంట్‌ కష్టాలు

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి డయాలసిస్‌ సెంటర్‌లో గురువారం ఉదయం కరెంట్‌ సరఫరాకు అంతరాయం కలగడంతో డయాలసిస్‌ పేషెంట్లు తీవ్ర అవస్థలు పడ్డారు. దాదాపు మూడున్నర గంటల పాటు పడిగాపులు కాశారు. రోజు మాదిరిగానే ఉదయం 6:30 గంటలకు ఫస్ట్‌ షిఫ్ట్‌ డయాలసిస్‌ రోగులు వచ్చారు. కాగా డయాలసిస్‌ సెంటర్‌లో కరెంట్‌ సరఫరా లేదు. దీంతో సిబ్బంది ఆరా తీయగా వైర్ల సమస్యతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినట్లు గమనించారు. వెంటనే మరమ్మతులు చేసి కరెంట్‌ను పునరుద్ధరించారు. ఉదయం 10గంటల తర్వాత డయాలసిస్‌ ప్రారంభమైంది. కాగా ఉదయం 6 గంటలకే రావడంతో ఒకరిద్దరు పేషెంట్లు నిరసించిపోయారు. మొదటి షిఫ్ట్‌ ఆలస్యంగా ప్రారంభం కావడంతో మిగతా షిఫ్ట్‌ల పేషెంట్లు ఇబ్బందులు పడ్డారు. భవిష్యత్‌లో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు రోగులు కోరుతున్నారు. కాగా ఆస్పత్రిలో మొత్తం 10 బెడ్‌లు ఉండగా నిత్యం 30 మంది పేషెంట్లకు డయాలసిస్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement