రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
శంషాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మొహ్మదాబాద్‌కు చెందిన రామటెంకి సిద్ధార్థ్ (22) మండల పరిధిలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. నర్కూడలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఈ నెల 18న బైక్‌పై స్నేహితుడు రోహిత్‌తో కలిసి కళాశాల వైపు వెళ్తుండగా..ఎదురుగా వచ్చిన ఆటో ట్రాలీ వేగంగా వీరి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా.. సిద్ధార్థ్ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


