క్షతగాత్రులకు చెక్కుల అందజేత | - | Sakshi
Sakshi News home page

క్షతగాత్రులకు చెక్కుల అందజేత

Nov 20 2025 9:52 AM | Updated on Nov 20 2025 9:52 AM

క్షతగాత్రులకు చెక్కుల అందజేత

క్షతగాత్రులకు చెక్కుల అందజేత

తాండూరు రూరల్‌: చేవెళ్ల వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటన ఇంకా మరిచిపోలేదని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో బస్సు ప్రమాదంలో గాయపడిన 10 మందికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం చెక్కులను సబ్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేవెళ్ల బస్సు ప్రమాదంలో తాండూరుకు చెందిన 13 మంది మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని చెప్పారు. బస్సు ప్రమాదంలో బాధితులకు ఎంత పరిహారం ఇచ్చిన వారి కుటుంబ సభ్యుల క్షోభను పూడ్చలేమని సబ్‌ కలెక్టర్‌ ఉమా శంకర్‌ ప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెవరైనా బస్సు ప్రమాదంలో గాయాలై ఉంటే, ఫొటోలతో దరఖాస్తును తహసీల్దార్‌ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బాల్‌రెడ్డి, తహసీల్దార్‌ తారాసింగ్‌, నాయకులు సంపత్‌కుమార్‌, ఉత్తమ్‌చందు,ఽ ధారాసింగ్‌, రవూఫ్‌, సురేందర్‌రెడ్డి, అబీబ్‌లాల, ప్రభాకర్‌గౌడ్‌, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గాయపడిన వారి వివరాలు

బి.శ్రీనివాస్‌(గాంధీనగర్‌), బ్యాగరి ప్రవీణ(గ్రీన్‌సిటీ), అబ్దుల్‌ మాజీద్‌(గాంధీనరగ్‌), సొమయ్య(గ్రీన్‌సిటీ), జగదీష్‌(వీరారెడ్డిపల్లి), చాకలి శ్రీసాయి (మల్‌రెడ్డిపల్లి), రాధ(కుమ్మరిగల్లి), అక్రం(మోమి న్‌గల్లి), బస్వరాజ్‌(యాలాల), బొయిని స్వప్న(పెద్దేముల్‌)కు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు మొత్తం రూ.20 లక్షలను క్షతగాత్రులకు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement