మైల్వార్‌లో ఇసుక డంపులు | - | Sakshi
Sakshi News home page

మైల్వార్‌లో ఇసుక డంపులు

Nov 20 2025 9:52 AM | Updated on Nov 20 2025 9:52 AM

మైల్వ

మైల్వార్‌లో ఇసుక డంపులు

అనుమతులు లేకుండా

నిల్వ చేస్తున్న వైనం

పట్టించుకోని అధికార యంత్రాంగం

బషీరాబాద్‌: ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. మండలంలో రాత్రి వేళల్లో వాగులు, వంకల నుంచి తోడుకొచ్చి రహస్యంగా డంపు చేస్తున్నారు. ముఖ్యంగా మైల్వార్‌ గ్రామంలో ఇసుక మాఫియా అక్రమార్కులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. చీకటి పడితే చాలు ఎక్మాయి, కొత్లాపూర్‌ శివారులోని వాగుల్లో నుంచి ఇసుక తోడేస్తున్నారు. మైల్వార్‌ గ్రామంలో ఎక్కడపడితే అక్కడ ఇసుక నిల్వలు దర్శనమిస్తున్నాయి. ఇందిరమ్మ ఇసుక రవాణాలో అక్రమాలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్‌ కొంత కాలం వరకు అనుమతులు ఇవ్వొద్దంటూ తహసీల్దార్‌లకు గత వారం కిందట ఆదేశాలు జారీ చేశారు. అయితే అక్రమార్కులు మాత్రం రాచమార్గంలో ఇసుకను రవాణా చేస్తున్నారు. నివారించాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

ట్రాక్టర్‌ పట్టివేత

బషీరాబాద్‌ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి ఓ ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో మోడల్‌ స్కూల్‌ సమీపంలో ట్రాక్టర్‌ను పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ మరాఠి శ్యామ్‌ ఇసుక అక్రమంగా తరలిస్తున్నాని తేలడంతో కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నుమాన్‌ అలీ తెలిపారు.

మైల్వార్‌లో ఇసుక డంపులు 1
1/1

మైల్వార్‌లో ఇసుక డంపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement