డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
షాద్‌నగర్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ విజయ్‌కుమార్ వ్యతిరేక దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు వినియోగించినట్లు సమాచారం ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు చేరవేయాలని సూచించారు. డ్రగ్స్‌ను నిషేధించడం ప్రతీ పౌరుడి బాధ్యత అన్నారు. విద్యార్ధులు, యువకులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం పోలీసులతో ప్రతిజ్ఞ చేయించారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో..
మాదక ద్రవ్యాల నివారణకు మంగళవారం చించోడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, డాక్టర్ ప్రవీణ, సూపర్ వైజర్ చంద్రకళ, నర్సులు సువర్ణ, ఫకీరమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు
షాద్‌నగర్‌రూరల్: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని పీఎస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళిత యువకుడు రాజశేఖర్‌ను హత్య ఘటనలో ఇప్పటికే ఏడుగురిని రిమాండ్‌కు తరలించగా పరారీలో ఉన్న గణేశ్‌ను బుధవారం అరెస్ట్ చేశామన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్య కేసును నమోదయిందన్నారు. నిందితులకు చట్టపరంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కాగుల వెంకటేశ్ మీడియా ముసుగులో జర్నలిస్టుగా చలామణి అవుతున్నాడని, నకిలీ మీడియా విలేకరులపై సైతం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసు దర్యాప్తులో ప్రధాన భూమిక పోషించిన సీఐ విజయ్‌కుయార్, ఎస్‌ఐలు సుశీల, శరత్‌కుమార్, సిబ్బందిని అభినందించారు.
ఏసీపీ లక్ష్మీనారాయణ


