వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
కొందుర్గు: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఓ ఎంపీటీసీ మాజీ సభ్యుడు మృతి చెందాడు. ఎస్‌ఐ రవీందర్ నాయక్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని వెంకిర్యాలకు చెందిన కలాల్ మాసయ్యగౌడ్(60) సోమవారం తన టీవీఎస్ మోటార్ సైకిల్‌పై పొలం నుంచి ఇంటి వస్తుండగా కొల్లూరు–వెంకిర్యాల మార్గంలో ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మాసయ్యగౌడ్‌ను చికిత్స నిమిత్తం శంషాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు. మృతుడి సోదరుడి కుమారుడు ఆనంద్‌గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వీధి కుక్కను తప్పించబోయి..
యాచారం: వీధి కుక్కను ఢీకొట్టిన ద్విచక్రవాహనదారుడు చికిత్ప పొందుతూ మృతి చెందాడు. సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని చౌదర్‌పల్లికి చెందిన అజ్జు(40) సోమవారం రాత్రి 10.30గంటలకు తన బైక్‌పై చీదేడ్‌లో అత్తారింటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో గడ్డమల్లయ్యగూడ సమీపంలో వీధి కుక్కను ఢీకొట్టాడు. క్షతగాత్రుడిని ఇబ్రహీంపట్నంలోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య ఆసియా, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


