ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చర్యలు
తాండూరు టౌన్: ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని పలు రద్దీ మార్గాల్లో రోడ్డుకు ఇరువైపులా ఇష్టానుసారంగా నిలిపిన తోపుడు బండ్లు, ఆటోలు వాహనాలను పరిశీలించారు. వారితో మాట్లాడి ట్రాఫిక్ అంతరాయం కలిగేలా వాహనాలు నిలుపొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతోపాటు చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. వాహనాలు, ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించే విధంగా ఆటోలతో పాటు ఇతర వాహనాలను నిలపొద్దన్నారు. వారంలో ఓ రోజు ట్రాఫిక్ నియంత్రణపై పలు ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. డీఎస్పీతో వెంట మున్సిపల్ కమిషనర్ యాదగిరి, పట్టణ సీఐ సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.
వాంగ్మూలం సేకరించిన డీఎస్పీ
తాండూరు టౌన్: హత్య కేసులో విచారణ నిమిత్తం ఓ వ్యక్తిని ఠాణాకు పిలిపించి చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో మంగళవారం డీఎస్పీ నర్సింగ్ యాదయ్య బాధితుడి వాంగ్మూలం సేకరించారు. ఈ మేరకు ఆయన తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి వెళ్లి ఫిరోజ్ చెప్పిన వివరాలు రికార్డు చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ.. ఎస్‌ఐ వేణుకుమార్‌పై సేకరించిన విషయాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. డీఎస్పీ వెంట తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి, యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి అన్నారు.
తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చర్యలు


