జనావాసాల మధ్య ఎస్‌టీపీ వద్దు
ఆందోళన చేపట్టిన ప్రజలు
● మరోచోటుకు తరలించాలని డిమాండ్
అబ్దుల్లాపూర్‌మెట్: పెద్దఅంబర్‌పేట రెవెన్యూ సర్వే నెంబర్ 292లో ఎస్‌టీపీ (మురుగు నీటి శుద్ధి ప్లాంటు)ను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం అంబికా నగర్, స్వగృహ కాలనీ, పోలీస్ కాలనీ, దయాకర్ రెడ్డి కాలనీల ప్రజలు ఆందోళనకు చేపట్టారు. ఈ ప్లాంట్ నిర్మాణంతో భూగర్భ జలాలు కలుషితమై ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈదుల చెరువు సైతం కలుషితమై చేపల పెంపకానికి ఇబ్బందిగా మారే అవకాశముందన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్లాంట్‌ను జనావాసాలకు దూరంగా ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్‌టీపీ ప్లాంట్ వద్దు.. పార్కులు ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజశేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కృష్ణారెడ్డి, మురళీధర్ రెడ్డి, పెంటయ్య, కృష్ణారెడ్డి, చిన్న భూపాల్ రెడ్డి, రాజు, అయ్యప్ప రెడ్డి, నర్సింగ్ రావు, అశోక్ రెడ్డి, బీజేపీ నాయకులు శ్రీనివాస్ యాదవ్, జగన్‌మోహన్ రెడ్డి, చంటి, ఆయా కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


