అప్పుడే డంపు.. కాసేపటికే తొలగింపు
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ వనిత హెచ్చరించారు. మంగళవారం పురపాలక సంఘం పరిధి కమ్మగూడలోని సర్వే నంబర్ 212లో లారీలో వ్యర్థాలను తీసుకువచ్చి డంప్ చేస్తుండగా స్థానికులు గమనించి మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్ వనిత రంగంలోకి దిగారు. అప్పటికే పెద్ద మొత్తంలో వ్యర్థాలను డంప్ చేయడంతో అడ్డుకొని హెచ్చరించారు. తిరిగి డంప్ చేసిన చెత్తను లారీ యజమానితోనే జేసీబీ తెప్పించి ఎత్తి వేయించారు. అనంతరం రూ.వేయి జరిమానా విధించినట్లు తెలిపారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసి, పర్యావరణ కాలుష్యానికి కారకులు కావద్దని కోరారు. – తుర్కయంజాల్
అప్పుడే డంపు.. కాసేపటికే తొలగింపు


