పాడి పరిశ్రమ అభివృద్ధితో లాభాలు
షాబాద్: మహిళలు, యువకులు పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటే మంచి లాభాలు ఆర్జించ వచ్చునని పశువైద్య వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ కొండల్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కుర్వగూడలో సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ రత్నాకర్, పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ వర్సిటీ(పీవీఎస్‌ఆర్‌టీయూ) రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో జిల్లా శాసీ్త్రయ పద్ధతుల డెయిరీసాగు, పాల ఉత్పత్తుల విలువల జోడింపుపై మహిళలకు, యువకులకు ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసీ్త్రయ పద్ధతిలో పాడి పశువుల పెంపకం, పాల పదార్థాల తయారీపై అవగాహన కల్పించామన్నారు. డాక్టర్ ఎం.శశికుమార్, సాహిత్యరాణి శాసీ్త్రయ పద్ధతుల ఆధారంగా ఆధునిక డెయిరీ ఫారాల స్థాపనపై సూచనలు ఇచ్చారు. పశుపోషణ, షెడ్ నిర్మాణం, తక్కువ లాభాలు వంటి అంశాలపై వివరించారు. రత్నాకర్ మాట్లాడుతూ.. డెయిరీ రంగంలో గ్రామీణ మహిళల సాధికారత అంశంపై పాడి రైతులకు సూచనలు, సలహాలు అందించారు. పాల ఉత్పత్తి, పశుపోషణ వంటి కార్యకలాపాల్లో మహిళల పాత్రను కొనియాడారు. ప్రభుత్వం పథకాల వినియోగం, వ్యాపార నైపుణ్యాల సాధన ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలన్నారు. మజ్జిగ, నెయ్యి, క్రీమ్ తయారీపై డెమో ఇచ్చారు. పాలపదార్థాల తయారీపై వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుర్వగూడ మాజీ సర్పంచ్ బుయ్యని సంధ్య మల్లికార్జున్‌గౌడ్, కార్యదర్శి యాదయ్య, శ్రీనివాస్, పద్మ, పాడి రైతులు యాదయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
పశు వైద్య వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ కొండల్‌రెడ్డి


