ప్రజలకు మరింత చేరువవుతాం
అనంతగిరి: ప్రజలకు మరింత చేరువకావడం ద్వారా వారి సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు అవకాశం లభిస్తుందని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్‌లోని తన కార్యాలయం నుంచి డయల్ యువర్ ఎస్పీ అనే కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం 26 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. మహిళల భద్రత, ఇసుక, ఎర్రమట్టి అక్రమ రవాణా, భార్య భర్తల మధ్య గొడవలు, వ్యక్తిగత సమస్యలు, పొలాల్లోకి అక్రమంగా ప్రవేశించడం, ట్రాఫిక్ సమ స్యలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రతి సోమ వారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 08416–255601 నంబర్‌లో సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ నారాయణరెడ్డి
డయల్ యువర్ ఎస్పీకి 26 ఫిర్యాదులు


