విచారణకు పిలిచి..
తాండూరు రూరల్: కేసు విచారణకు ఠాణాకు పిలిచిన ఎస్‌ఐ తనను తీవ్రంగా కొట్టారని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన పెద్దేముల్ పీఎస్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ప్రస్తుతం తాండూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన ఫిరోజ్ వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సెప్టెంబర్ 7న ఫిరోజ్ మామ గౌస్‌మియా కౌలు పొలం వద్ద మృతి చెందాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా ఆదివారం సాయంత్రం పెద్దేముల్ ఎస్‌ఐ వేణుకుమార్ ఫిరోజ్‌ను స్టేషన్‌కు పిలిపించాడు. గౌస్‌మియాను నువ్వే చంపావు.. నేరం ఒప్పుకోవాలని తనను విచక్షణా రహితంగా కొట్టడాని చెప్పాడు. గంటపాటు చిత్రహింసలు పెట్టి విషయం బయటకు చెప్పొద్దని బెదిరించాడని ఆరోపించాడు. విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో రాత్రి 8.45 గంటలకు చికిత్స నిమిత్తం తాండూరు జిల్లా ఆస్పత్రిలో చేర్పించారన్నారు. ఈ విషయం సోమవారం పెద్దేముల్ మండలంలో కలకలం రేపింది.
ఠాణా ఎదుట ఉద్రిక్తత
పెద్దేముల్ పీఎస్ ఎదుట సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫిరోజ్ బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఠాణాకు చేరుకున్నారు. విచారణ పేరుతో పిలిచి కొట్టిన ఎస్‌ఐ, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ నగేశ్, కరన్‌కోట్ ఎస్‌ఐ రాథోడ్ వినోద్, యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, పది మంది కానిస్టేబుళ్లతో స్టేషన్ వద్ద బందోబస్తు నిర్వహించారు. ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
విచక్షణా రహితంగా కొట్టారు
నేరం ఒప్పుకోవాలని చిత్రహింసలు పెట్టారు: బాధితుడు ఫిరోజ్
పెద్దేముల్ పోలీసులపైబాధిత కుటుంబీకుల ఫిర్యాదు
విచారణకు పిలిచి..


