దళారులకు ధాన్యం విక్రయించొద్దు
దుద్యాల్: రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి లాభాలు పొందాలని కొడంగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్యగౌడ్ సూచించారు. సోమవారం మండల పరిధిలోని హస్నాబాద్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ధాన్యం దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. వారు అధిక ధరను ఆశ చూపి తూకం చేసే విధానంలో మోసం చేస్తూ రైతుకు నష్టం కల్గిస్తారని వివరించారు. మండల పరిధిలోని గౌరారంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆవుటి శేఖర్, కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకారం వేణుగోపాల్, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్ గుప్తా, కాంగ్రెస్ కొడంగల్ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, జిల్లా కార్యదర్శి మల్లేశ్, నాయకులు భీములు, పులిందర్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రైతుల అభ్యున్నతికి కృషి
పరిగి: రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పరుశురాంరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిఽధిలోని సుల్తాన్‌పూర్, రంగంపల్లి, గడిసింగాపూర్, ఇబ్రహీంపూర్ గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పరుశురాంరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ అయూబ్, డీసీఎంఎస్ అధికారులు శ్యాంసుందర్‌రెడ్డి, ఇన్‌చార్జి వెంకటయ్య, డైరెక్టర్ శశికళ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు తావుర్యానాయక్, నార్మక్త్ డైరెక్టర్ వెంకట్‌రాంరెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్ ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్
దళారులకు ధాన్యం విక్రయించొద్దు


