తరగతి గదిలో విద్యార్థినికి షాక్‌ | - | Sakshi
Sakshi News home page

తరగతి గదిలో విద్యార్థినికి షాక్‌

Nov 18 2025 7:32 AM | Updated on Nov 18 2025 7:32 AM

తరగతి

తరగతి గదిలో విద్యార్థినికి షాక్‌

తాండూరు రూరల్‌: ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఓ పదో తరగతి విద్యార్థిని కరెంట్‌ షాక్‌కు గురైన ఘటన సోమవారం, వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలం మంబాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. రుక్మాపూర్‌ గ్రామానికి చెందిన రవికుమార్‌ కుతూరు వాణిశ్రీ మంబాపూర్‌ ఉన్నత పాఠశాలలో టెన్త్‌ చదువుతోంది. మధ్యా హ్నం భోజన విరామం తర్వాత పాఠశాల గదిలో తోటి విద్యార్థులతో కలిసి ఉండగా, డిజిటల్‌ బోర్డు కు సంబంధించిన బ్యాటరీల వద్ద ఎర్తింగ్‌ రావడంతో షాక్‌కు గురైంది. దీంతో తీవ్రంగా భయపడిన బాలిక, కొద్దిసేపు గజగజ వణికింది. విషయం తెలుసుకున్న హెచ్‌ఎం శ్రీనివాస్‌, సిబ్బంది వెంటనే బాలికను తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రమాదమేమీ లేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాణిశ్రీకి చికిత్స అందించి, పాఠశాలకు పంపించారు. వెంటనే మెకానిక్‌ను పిలిపించి ఎర్తింగ్‌ సమస్యను పరిష్కరించి, తీగలను సరిచేయించారు.

మంబాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘటన

తరగతి గదిలో విద్యార్థినికి షాక్‌ 1
1/1

తరగతి గదిలో విద్యార్థినికి షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement