సకాలంలో బిల్లులు చెల్లించండి
ప్రజాసంఘాల నాయకుల డిమాండ్
బొంరాస్‌పేట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను మంజూరు చేయడంలో అధికారులు పక్షపాత ధోరణీని అవలంభించడం బాధాకరమన్నారు. అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం గురించి హౌజింగ్ డీఈ, ఏఈలు, ఎంపీడీఓలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో బిల్లులను పరిశీలించి పేదలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కొత్తూరు చంద్రయ్య, కేఎన్‌పీఎస్ నాయకుడు లక్ష్మయ్య, డప్పు కళా కారుడు ఏర్పుమళ్ల చంద్రయ్య, పాల్గొన్నారు


