అంగన్‌వాడీల బలోపేతానికి కృషి
దుద్యాల్: అంగన్‌వాడీల బలోపేతానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ముచ్చుకుంట తండాలో నూతనంగా నిర్మించే అంగన్‌వాడీ భవనానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శేఖర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో గిరిజన తండాల అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తండాలకు పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, సీసీ రోడ్లు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రూ.20 లక్షలు వెచ్చింది అంగన్‌వాడీ భవన నిర్మాణానికి పనులు ప్రారంభిచామన్నారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకారం వేణుగోపాల్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు వెంకటయ్య, మెట్లకుంట పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ, ముచ్చకుంట తండా కాంగ్రెస్ అధ్యక్షుడు రూప్లా నాయక్, నాయకులు పులిందర్ రెడ్డి, ఖాలీల్ పాషా, శ్రీకాంత్, సత్యనారాయణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయ సంస్థ ౖజిల్లా చెర్మన్ రాజేశ్ రెడ్డి


