గ్రామ పోలీసు వ్యవస్థకు గ్రహణం | - | Sakshi
Sakshi News home page

గ్రామ పోలీసు వ్యవస్థకు గ్రహణం

Nov 12 2025 9:41 AM | Updated on Nov 12 2025 9:41 AM

గ్రామ

గ్రామ పోలీసు వ్యవస్థకు గ్రహణం

పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాం

బషీరాబాద్‌: ప్రజలతో పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలన్న భావనతో గత ప్రభుత్వం 2017లో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి జీపీలో గ్రామ పోలీసును తీసుకువచ్చింది. వీరు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామంలో జరిగే చిన్న చిన్న తగాదాలను అక్కడే పరిష్కరించాలి. ఏదైనా శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు అక్కడికి వెళ్లి గ్రామస్తులతో చర్యలు జరిపి సామరస్య వాతావరణం నెలకొనేలా చూడాలి. చాలా కాలంగా ఈ వ్యవస్థ మరుగును పడింది. బషీరాబాద్‌ ఠాణాలో సిబ్బంది కొరత కూడా ఇందుకు కారణమనే చెప్పవచ్చు. మండలంలో 39 పంచాయతీలు.. 60 వేలకు పైగా జనాభా ఉంది. కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడ నేరాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు 30 మంది పీసీలు మంజూరు కాగా 15 మందిని కేటాయించారు. ప్రస్తుతం ఆరు మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగతా వారు ఇతర పోలీస్‌ స్టేషన్లలో, డిప్యూటేషన్లపై వెళ్లారు. ఇద్దరు ఎస్‌ఐలకు గాను ఒక్కరే ఉన్నారు. మూడు నెలల క్రితం ఇక్కడికి వచ్చిన ఎస్‌ఐ – 2 కోర్టు డ్యూటీ వేయించుకొని వెళ్లారు. ఏఎస్‌ఐ పోస్టులు 3 ఉండగా ఒక్కరూ లేరు. 5 మంది హెడ్‌ కానిస్టేబుళ్లకు గాను నాలుగురు పనిచేస్తున్నారు. పోలీస్‌ వ్యవస్థ ఇంతా బలహీనంగా ఉంటే మండలంలో శాంతిభద్రతల పరిస్థితి ఏంటని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరమ్మతులకు నోచుకోని వాహనం

స్టేషన్‌కు కేటాయించిన ఇన్నోవా వాహనం మరమత్తులకు నోచుకోక నాలుగు నెలలుగా మూలన పడింది. ప్రస్తుతం ఒక వాహనం మాత్రమే అందుబాటులో ఉంది. నిధులు లేని కారణంగానే బాగుచేయించలేదని పోలీసులు చెబుతున్నారు. వాహన మరమ్మతులకు దాదాపు రూ.లక్ష వరకు ఖర్చు చేయాల్సి ఉందని వారు తెలిపారు.

ప్రజలకు అందని సేవలు

తగాదాలు చోటుచేసుకుంటే ఠాణాకు వెళ్లాల్సిందే

బషీరాబాద్‌ పీఎస్‌ను వెంటాడుతున్న సిబ్బంది కొరత

30 మంది పీసీలకు.. 6 మందే..

గాల్లో దీపంలా శాంతిభద్రతలు

పట్టించుకోని ఉన్నతాధికారులు

మండలంలోని ప్రతి గ్రామంలో రాత్రి వేళ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాం. డయల్‌ 100 కాల్స్‌ అటెండ్‌ చేస్తున్నాం. ప్రతి జీపీకి ఒక కానిస్టేబుల్‌ను నియమించడం సాధ్యం కాదు. సిబ్బంది కొరత కారణంగా ఒక్కొక్కరికి గ్రామాల చొప్పున కేటాయించాం. గ్రామ పోలీసు సేవలను విస్తృతపరుస్తాం.

– నుమాన్‌అలీ, ఎస్‌ఐ, బషీరాబాద్‌

గ్రామ పోలీసు వ్యవస్థకు గ్రహణం1
1/1

గ్రామ పోలీసు వ్యవస్థకు గ్రహణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement