ఇసుక రవాణాను కట్టడి చేయండి
అనంతగిరి: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనుమతి లేకుండా రవాణా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఇసుక అక్రమ రవాణాపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, రెవెన్యూ శాఖలు ఎక్కడికక్కడ తనిఖీలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, డీఆర్‌ఓ మంగీలాల్, మైన్స్ ఏడీ సత్యనారాయణ, డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్, ఇరిగేషన్ ఈఈ అశోక్, గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ రవి, ఆయా మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్


