శాంతిభద్రతల పరిరక్షణలో మీ పాత్ర కీలకం
ఆర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బందితో సీపీ సజ్జనర్
చార్మినార్: శాంతి భధ్రతల పరిరక్షణలో ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ అన్నారు. హైదరాబాద్ పేట్ల బురుజులోని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్‌లో శనివారం జరిగిన సెరిమొనియల్ పరేడ్‌లో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ పాల్గొన్నారు. సిబ్బంది నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..దశాబ్దాల చరిత్రగల సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగానికి మంచి పేరు ఉందని, సిబ్బంది నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. ఏఆర్‌కు చెందిన 1044 మంది ఈ పరేడ్ నిర్వహించారు. పరేడ్ అనంతరం ఏఆర్ సిబ్బందితో మాట్లాడుతూ వారి పనితీరుతో పాటు క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న ఇబ్బందులను అడిగి తెలు సు కున్నారు. ఆ తరువాత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి..మెరుగైన పోలీసింగ్ కొరకు కృషి చేయాలని సూచించారు.


