
సీజేఐపై దాడి యత్నం అనాగరికం
అనంతగిరి: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్‌పై జరిగిన దాడి అనాగరికమని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, వికారాబాద్ జిల్లా ఇన్‌చార్జి గట్టగల్ల ప్రశాంత్ మాదిగ అన్నారు. సమితి, ఎంఎస్పీ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయాన్ని కాపాడే వారిపై ఇలాంటి దాడులు జరిగితే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని, దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్, ఆయన వెనక ఉన్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్, రాష్ట్ర నాయకులు మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి స్వామిదాస్, కృష్ణ, నర్సింహులు, సుభాష్ డప్పు మహేందర్, పుష్ప రాణి, సునిత తదితరులు పాల్గొన్నారు.