
యథావిధిగా ప్రజావాణి
కలెక్టర్ ప్రతీక్‌జైన్
అనంతగిరి: ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ ప్రతీక్‌జైన్ శనివారం ఓప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రద్దు చేసినట్లు ప్రకటించామని.. ఎన్నికల స్టే రావడంతో కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని చెప్పారు. ప్రజలు గమనించి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జుంటుపల్లి రామాలయ
అభివృద్ధికి చర్యలు
తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
యాలాల: మండల పరిధిలోని జుంటుపల్లి సీతారామ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే మనో హర్‌రెడ్డి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జుంటుపల్లికి చెందిన ఆశప్ప ఏర్పా టుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రామాలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలను తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
బీసీ రిజర్వేషన్లకు
కేంద్రం అడ్డంకులు
సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్
అనంతగిరి: తెలంగాణ బీసీలపై కేంద్రం కపట నాటకం తేటతెల్లమైందని సీపీఎం జిల్లా కార్య దర్శి మైపాల్ విమర్శించారు. శనివారం వికా రాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టా రు. ఈ సందర్భంగా మైపాల్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను గవర్నర్ ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. బీజేపీ నాయకత్వం బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని లేదంటే బీసీ లను క్షమాపన కోరాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పద్ధతిలో రిజర్వేషన్ల అమలుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సుదర్శన్, సతీశ్, నవీన్, అక్బర్, గోపాల్, శ్రీనివాస్, మహేందర్, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
డీజీపీని కలిసిన బార్
అసోసియేషన్ కమిటీ
ఇబ్రహీంపట్నం: డీజీపీ శివధర్‌రెడ్డిని ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా 12 కోర్టు భవన సముదాయాల నిర్మాణం గురించి వివరించారు. తనవంతు సహకారం అందిస్తానని శివధర్‌రెడ్డి తెలిపినట్లు వారు చెప్పారు. అదేవిధంగా న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డిని సైతం కలిసి స్థానిక సమస్యలను వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌కుమార్, ఉపాధ్యక్షుడు భాస్కర్, లైబ్రరీ సెక్రటరీ పాండు పాల్గొన్నారు.
మున్సిపల్ సిబ్బంది
సమస్యలు పరిష్కరించాలి
పహాడీషరీఫ్: రాష్ట్రంలో మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న కారోబార్, బిల్ కలెక్టర్‌ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ కారోబార్, బిల్ కలెక్టర్ల కమిటీ కోరింది. ఈ మేరకు కమిటీ నాయకులు రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహా రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 2016లో ఇచ్చిన జీవోఎంఎస్–14 ప్రకారం మున్సిపాలిటీలో కలిసిన గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. తమకు కేటాయించిన పనులను సమర్థవంతంగా చేస్తున్నప్పటికీ, నెలకు కేవలం రూ.15,600 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న అందరినీ రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనం రూ.22,750 చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

యథావిధిగా ప్రజావాణి

యథావిధిగా ప్రజావాణి