
బాలికలను ప్రోత్సహించడం బాధ్యత
అనంతగిరి: సమాజంలో లింగ సమానత్వం, బాలి క హక్కులను కాపాడాల్సిన బాధత్య ప్రతీ ఒక్కరిపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు అన్నారు. శనివా రం అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకారంతో వికారబాద్ డైట్ కళాశాలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. చదువు తో ఏదైనా సాధ్యమని.. తల్లిదండ్రులు బాలికలను సైతం బాలురతో సమానంగా అన్నిరంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు హక్కుల పై అవగాహన పెంచుకుని సమాజంలో సమాన త్వం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శాంతిలత జువైనైల్ జస్టిస్ చట్టం,బాల్యవివాహ నిషేధ చట్టం, బాలల హక్కుల పరిరక్షణ గురించి వివరించారు. బాల్యవివాహాలు, బాలల దుర్వినియోగం అరికట్ట డంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.అనంతరం ఎంవీ ఫౌండేషన్ రాష్ట్ర సమన్వయకర్త రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. బాలబాలికలకు విద్యను అందించాల్సిన బాధ్యత సమా జం, ప్రభుత్వం మీద ఉందన్నారు.గ్రామ స్థాయిలో విద్యను ప్రోత్సహించి బాల్యవివాహాలు అరికట్టాల ని కోరారు.అనంతరం విద్యార్థులతో లింగ సమానత్వం, బాలల హక్కుల పరిరక్షణపై నిబద్ధతతో ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్మన్ వెంకటేశ్, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ టి.వెంకటేశ్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శ్రీనివాస్, ఎస్‌ఐ మీనాక్షి , ఫౌండేషన్ సమన్వయకర్త శ్రీనివాస్, సాధన సమితి ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.