
పప్పు ధాన్యాలకు డిమాండ్
పరిగి: పప్పు ధాన్యాల సాగుతో రైతులు అధిక లాభాలు ఆర్జించవచ్చునని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని నస్కల్ రైతు వేదికలో పప్పు ధాన్యాల్లో ఆత్మ నిర్భర్ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలకమైందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్పిడీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న నేపథ్యంలో పప్పు ధాన్యాల సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలన్నారు. ప్రతీ గ్రామంలో రైతు సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. వ్యవసాయాధికారుల సూచనలు సలహాలు పాటించి సత్ఫలితాలు రాబట్టాలన్నారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ డీఎస్ లక్ష్మీకుమారి, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ ఆయూబ్, కాంగ్రెస్ పూడూర్ మండల అధ్యక్షుడు సురేందర్‌ముదిరాజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హస్తం గూటికి బీఆర్‌ఎస్ నేతలు
గండీడ్ మండల పరిధిలోని చెన్నాయపల్లి తండా అనుబంధ గ్రామం మాలగుడిసెలకు చెందిన బీఆర్‌ఎస్ నేతలు హస్తం గూటికి చేరుకున్నారు. శనివారం పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి నివాసంలో ఆయనను కలసి పార్టీలో చేరారు. పెద్ద అంజిలయ్య, చిన్న అంజిలయ్య, రమేశ్, సురేశ్, కృష్ణ, వెంకటయ్య, రమేశ్, మాధురి వెంకటయ్య, మొగులయ్యతో పాటు మరో 50 మందికి ఎమ్మెల్యే కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ నర్సింహారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి,ఎస్సీ, ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి మోహన్‌నాయక్, వర్కింగ్ ప్రసిడెంట్ శ్రీనివాస్‌రెడ్డి, నేతలు, తదితరులు పాల్గొన్నారు.