
హత్యాయత్నం కేసులో ముగ్గురికి రిమాండ్
మొయినాబాద్‌రూరల్: ఆస్తి వివాదంలో వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించామని మొయినాబాద్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి చెప్పారు. వివరాలు.. సురంగల్ పౌల్ట్రీ ఫామ్‌లో 250 గజాల ప్లాట్ విషయంలో తగాదా జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం రామగళ్ల ప్రసాద్, రామగళ్ల నందం, సావిత్రి దంపతులు రామగళ్ల శ్యామ్‌పై వేట కొడవలితో దాడి చేయంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రాజేంద్రనగర్ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.