
క్రీడాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
అబ్దుల్లాపూర్‌మెట్: క్రీడాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని విద్యా కమిషన్ సభ్యుడు చారగొండ వెంకటేశ్ పేర్కొన్నారు. మండలంలోని బాటసింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న 69వ హయత్‌నగర్ జోనల్ లెవల్ కబడ్డీ టోర్నమెంట్‌తో పాటు క్రీడాకారుల ఎంపికను గురువారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. కేవలం సిలబస్ పూర్తిచేయడంపైనే దృష్టి పెట్టకుండా విద్యార్థులకు చదవడం, రాయడం, గణిత ప్రక్రియలు వచ్చేవిధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నిర్వాహకులు రాఘవ రెడ్డి, హయతనగర్ జోనల్ సెక్రటరీ నిర్మల, పీడీలు చంద్రమోహన్, వెంకటేశ్వర్లు, నర్సింహారావు, ఉషాకిరణ్, దాసరి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.