
రైతులకు అండగా ప్రభుత్వం
బొంరాస్‌పేట: రైతులకు అండగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటోందని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రం సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వ్యవసాయశాఖ నుంచి సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు అందజేశారు. వీసీసీ, బీఎల్‌డీ రకాల వేరుశనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ తెలిపారు. ఎకరానికి నాలుగు బస్తాల చొప్పున మండలంలోని మెట్లకుంట, మదన్‌పల్లి, బురాన్‌పేట గ్రామాల రైతులకు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. మిగిలిన గ్రామాలకు సైతం వేరుశనగ విత్తనాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి పోలప్ప, ఏఈఓలు స్వాతి, హేమ, శైలజ, పవన్, జగదీశ్, నాయకులు సురేందర్‌రెడ్డి, సత్యప్ప తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్‌రెడ్డి