
విద్యార్థులను ఉత్తములుగా తీర్చాలి
నవాబుపేట: విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో గురువారం ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి ఉపయోగపడే పౌరులను అందించాల్సిన బాధ్యత గురువుపైనే ఉందన్నారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులు.. వారి చేతిలోనే ఈ దేశ భవిష్యత్ ఉందన్నారు. ప్రభుత్వం పాఠశాలలకు అన్ని విధాలా సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్‌నాయక్, ఎంపీడీఓ అనురాధ, ఎంఈఓ అబ్దుల్ రెహమాన్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత, నాయకులు నాగిరెడ్డి, మల్లారెడ్డి, వెంకట్‌రెడ్డి, ఎక్‌బాల్, ప్రభాకర్, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య