పనులు సాగక..
● మహబూబ్‌నగర్–చించోలి జాతీయ రహదారి నిర్మాణంలో జాప్యం
● ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తిగానే రోడ్డు
● పట్టించుకోని అధికారులు
కొడంగల్: నత్తనడకన కొనసాగుతున్న రోడ్డు పను లతో కొడంగల్‌వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మహబూబ్‌నగర్–చించోలి జాతీయ రహదారి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏళ్లు గడుస్తున్నా రోడ్డు నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. కొడంగల్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్సాపూర్‌లో ఇటీవల వాహనాలు రోడ్డులో కూరుకుపోతున్నాయి. చివరకు బస్సులు, ఇతర వాహనాలను దారి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డంతా బురదమయంగా మారింది. ద్విచక్ర వాహనదా రులు జారి కింద పడిన సంఘటనలు సైతం ఉన్నా యి. పనులు చేయించడంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వాహనదారులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. జాతీయ నిర్మాణ పనులను రెండు బిట్లుగా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించారు. మహబూబ్‌నగర్ నుంచి దుద్యాల గేటు వరకు ఒక మోస్తరుగా పనులు జరిగాయి.
ద్విచక్ర వాహనదారులకు తిప్పలు
దుద్యాల నుంచి కొడంగల్, తాండూరు మీదుగా నిర్మిస్తున్న రహదారి పనులు మందకొడిగా సాగుతున్నాయి. రోడ్డు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ రహదారిపై వెళ్లాలంటే గగనంగా మారింది. భారీ వాహనాలు వెళ్లాలంటే డ్రైవర్లు భయపడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డును కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా గుర్తించి 167ఎన్ గా నామకరణం చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బూత్పూరు నుంచి కొడంగల్, తాండూరు, చించోలీ మీదుగా కర్ణాటక రాష్ట్రం మన్నెకెళ్లి వరకు జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. మన్నాకెళ్లి దగ్గర ముంబయి జాతీయ రహదారితో కలుస్తుంది. మొత్తం 150 కిలోమీటర్లు పొడవు గల ఈ జాతీయ రహదారి వికారాబాద్ జిల్లాలో 45 కిలోమీటర్లు ఉంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న రోడ్డును అధికారులు, నాయకులు పట్టించుకొని త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికుల అభ్యర్థన.
వాహనాలు కదలక