
బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
తాండూరు టౌన్: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా గురువారం స్థానిక తులసీ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో బీజేపీశ్రేణులు రక్తదాన శిబిరం నిర్వహించాయి. ఈ సందర్భంగా బీజేపీ, బీజేవైఎం, ఏబీవీపీ, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్, హిందూవాహిని, పలు స్వచ్ఛంధ సంస్థల సభ్యులు, మోదీ అభిమానులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ.. ప్రపంచానికి భారతదేశ గొప్పదనాన్ని చాటి చెప్పిన ఘనత మోదీకే దక్కిందన్నారు. ఆయన పాలనలో దేశ ప్రజలు సుభిక్షంగా వర్దిల్లుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయమన్నారు. ఈ శిబిరంలో నాయకులు సుభాన్ రెడ్డి, రజినీకాంత్, శ్రీలత, శ్రీహరి, గోపి, మల్లేశం, జగన్, వీరేందర్, మల్లు, శ్రీకాంత్, జగదీష్, కృష్ణ, కిరణ్, ప్రకాష్, శ్రీనివాస్, చందు, రఘు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.