షాబాద్: ప్రతీ పౌరుడు భారత రాజ్యాంగ పుస్తకం కలిగి ఉండాలని డీఎస్‌పీ ప్రచార కమిటీ నాయకుడు యాదయ్య మహారాజ్ అన్నారు. ఈ మేరకు సోమవారం వారు తహసీల్దార్ సైదులు గౌడ్, డిప్యూటీ తహసీల్దార్ మధుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ.. విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ పౌరుడికి రాజ్యాంగ పుస్తకం అందించేందుకు చర్యలు తీసుకోవాలని వినతులిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌పీ నాయకులు నరేశ్, మల్లేశ్, రాఘవేందర్, శివ, బాలు, నవీన్, సురేందర్, దయాకర్, మహేందర్, నర్సింలు, శ్రీకాంత్, చందు, రవి, బలరాం తదితరులున్నారు.
డీఎస్‌పీ ప్రచార కమిటీ నాయకుడు యాదయ్య మహారాజ్


