భూ వివాదంలో 15 మందిపై కేసు

పరిగి: భూ వివాదంతో 15 మందిపై కేసు నమోదయ్యింది. ఈ సంఘటన పూడూర్‌ మండలం చన్‌గోముల్‌ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై విఠల్‌రెడ్డి కథనం మేరకు.. చన్గోముల్‌ గ్రామ సర్వే నంబర్‌ 3 6లో 4 ఎకరాల భూమిని సంగారెడ్డికి చెందిన గడీల శ్రీనివాస్‌గౌడ్‌ గ్రామానికి చెందిన కమాల వీరమణి, కమల సోమలింగం వద్ద కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన పొలం చుట్టూ ఫెన్సింగ్‌ వేశాడు. అయితే గ్రామానికి చెందిన ఎండీ అజీం, అజారుద్దీన్‌, రహీస్‌ ఖాన్‌, జహీర్‌ఖాన్‌, నజీబ్‌ ఖాన్‌, కొంగి సత్తయ్య, కొమ్ము కృష్ణ, సిరాజుద్దీన్‌ ఫెన్సింగ్‌ను తొలగించారు. దీంతో బాధితుడు శ్రీనివాస్‌గౌడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ప్రయోగాత్మక విద్యతో లాభాలు
కొత్తూరు: ప్రయోగ్మాతకంగా విద్యాబోధన చేపడితే విద్యార్థులకు పాఠ్యాంశాలు సులువుగా అర్థమవుతాయని జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్‌ అధికారి (సీఎంఓ) కృష్ణయ్య సూచించారు. మండలంలోని ఇన్ముల్‌నర్వ గ్రామ జెడ్పీహెచ్‌ఎస్‌లో పీఅండ్‌జీ పరిశ్రమ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరిశ్రమ ఆర్థిక సహకారంతో మైండ్‌ స్పార్క్‌ సంస్థ సమకూర్చిన కంప్యూటర్‌ మోడల్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు దృశ్య, వీక్షణ ద్వారా పాఠ్యాంశాలు బోధిస్తే వారికి విషయ పరిజ్ఞానం పెరగడంతో పాటు చాలాకాలం వరకు గుర్తుంటాయన్నారు. కరోనా కారణంగా చదువులో వెనకబడిన విద్యార్థులకు ఇలాంటి బోధన ఎంతో ఉపయోగకరమని అన్నారు. కార్యక్రమంలో మైండ్‌ స్పార్క్‌ సంస్థ ప్రతినిధి విశ్వనాథ్‌, ఎంఈవో కృష్ణయ్య, పాఠశాల హెచ్‌ఎం పాల్గొన్నారు.

Read latest Vikarabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top