నాగలాపురం: నాగలాపురంలోని పడమట దళితవాడలోని ముత్తు మారియమ్మన్ తిరుణాళ్లల్లో భా గంగా ఆదివారం అర్ధరాత్రి అగ్నిగుండ ప్రవేశం కా ర్యక్రమం వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని, భక్తి శ్రద్ధలతో అగ్నిగుండ ప్రవే శం చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. చి త్తూరు, తిరుపతి జిల్లాల ఎస్సీ సెల్ సభ్యుడు దేశప్పన్ అన్న కుమారుడు అజిత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అజిత్ తలపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటో పెట్టుకుని జై జగన్ నినాదాలు చేస్తూ అగ్నిగుండ ప్రవేశం చేశాడు.
సీఎం ఆడియోతో
పింఛన్ సర్వర్ సమస్యలు
తిరుపతి అర్బన్: బాబు ప్రభుత్వం ప్రచారానికి పె ద్దపీట వేస్తుందంటూ జనం మండిపడుతున్నారు. ‘పింఛన్ల పంపిణీలో రెండేళ్లుగా శ్రమ లేకుండా మీ కు చంద్రబాబు పింఛన్ ఇస్తున్నారూ..గుర్తు పెట్టుకోండి’ అని 10 సెకన్ల ఆడియో పింఛన్‌దారుడికి వినిపించిన తర్వాతే అన్‌లైన్‌లో తీసుకుంటుంది. ఆ తర్వాత పింఛన్ నగదు చెల్లిస్తారు. ఈ నెలలో(జూన్ నుంచి) సోమవారం ఆ వీడియోను 20 సెకన్లుకు పెంచడంతోనే సర్వర్ సమస్యలు వచ్చా యని పింఛన్‌దారులు మండిపడుతున్నారు.


