తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి–రక్సౌల్ ఎక్స్‌ప్రెస్(రైలు నంబర్ 17433/17434)ను సోమవారం ఎంపీ మద్దిల గురుమూర్తి జెండా ఊపి, ప్రారంభించారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన ఈ రైలు ఇప్పుడు సాధారణ రైలుగా అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. ఈ రైలు నడపడం ద్వారా తిరుపతి ప్రాంత ప్రజలకు ఉత్తరాది రాష్ట్రాలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందన్నారు. స్టేషన్ డైరెక్టర్ మోహన్‌కృష్ణ, మేనేజర్ చిన్నపరెడ్డి, సీసీఆర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.


