– ఐదుగురికి గాయాలు
తొట్టంబేడు: ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఐదుగురు గాయపడిన ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. తొట్టంబేడు పోలీసుల కథనం.. శ్రీకాళహస్తి–నాయుడుపేట జాతీయ రహదారిలో శనివారం అర్ధరాత్రి తిరుపతి నుంచి నెల్లూరుకు ఆర్టీసీ బస్సు బయలుదేరింది. తొట్టంబేడు మండల పరిధిలోని జామ్‌జామ్ హోటల్ సమీపంలో లారీ రోడ్డుపై ఆగి ఉంది. దీన్ని వెనుక నుంచి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. తొట్టంబేడు ఎస్‌ఐ బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 19 మంది ఉన్నట్టు తెలిపారు.


